నల్లపరెడ్డి ఇంటిపై దాడి దారుణం
దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలని అశ్రిత్ రెడ్డి డిమాండ్
స్వాతంత్రం వచ్చిన తరువాత…ఇలాంటి దాడి చూడలేదు
- నల్లపరెడ్డి ఇంటిపై దాడి దారుణం
- దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలని అశ్రిత్ రెడ్డి డిమాండ్
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని… వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరు రూరల్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, నగర అధ్యక్షుడు యం డి తౌఫిక్ లతో కలసి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ…నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకమైనవి, హుందాతనానికి పెట్టింది పేరన్నారు. దశాబ్దాలుగా ఎన్నో రాజకీయ కుటుంబాలు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నాయని…అందులో ఒకటి నల్లపరెడ్డి కుటుంబమన్నారు. అలాంటి నల్లపరెడ్డి ఇంటిపైన దాడికి పాల్పడడం దారుణమన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రోహిత్ రెడ్డి, తౌఫిక్ లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి భాగం కార్యదర్శి సతీష్ బాబు, కోవూరు నియోజకవర్గం అధ్యక్షులు జెడ్డా సాయికుమార్, విద్యార్థి భాగం నాయకులు చంద్ర, లోకేష్, నయన్ తదితరులు పాల్గొన్నారు