రెవెన్యూ వ్యవస్థ తలమానికం..

ప్రతీ చోటా రెవెన్యూ సేవలు ఎంతో అవసరం జిల్లా జడ్జి శ్రీనివాసరావు_ _అట్టహాసంగా 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు ప్రారంభం_ _ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా జడ్జి, కలెక్టర్, జేసీ_ _వాలీబాల్‌ గేమ్‌ ఆడి ఉద్యోగుల్లో జోష్ నింపిన కలెక్టర్‌, జేసీ_

రెవెన్యూ వ్యవస్థ తలమానికం…

  • ప్రతీ చోటా రెవెన్యూ సేవలు ఎంతో అవసరం
  • జిల్లా జడ్జి శ్రీనివాసరావు
  • అట్టహాసంగా 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు ప్రారంభం
  • ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా జడ్జి, కలెక్టర్, జేసీ
  • వాలీబాల్‌ గేమ్‌ ఆడి ఉద్యోగుల్లో జోష్ నింపిన కలెక్టర్‌, జేసీ


నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యా క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను జిల్లా జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ లు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా క్రీడోత్సాల్లో పాల్గొన్నారు.


దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికమని…అలాగే ప్రతీ చోట రెవెన్యూ సేవలు ఎంతో అవసరమని జిల్లా జడ్జి శ్రీనివాసరావు కొనియాడారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడోత్సవాలు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడాజ్యోతిని వెలిగించి రెవిన్యూ క్రీడలను జడ్జి శ్రీనివాసరావుతో కలసి వారు ప్రారంభించారు. జిల్లా జడ్జికి మెమోంటో అందచేసి శాలువాతో సత్కరించారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఉద్యోగులతో కలసి కలెక్టర్ వాలీబాల్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఆనంద్ లు ప్రసంగించారు. నెల్లూరు, ఆత్మకూరు, కందుకూరు, కావలి రెవిన్యూ డివిజన్ల పరిధిలోని రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు పలు క్రీడల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్‌కలెక్టర్‌ శ్రీపూజ, డిఆర్‌వో హుస్సేన్‌ సాహెబ్‌, నెల్లూరు, కావలి ఆర్డీవోలు అనూష, వంశీకృష్ణ, కలెక్టరేట్‌ ఏవో విజయకుమార్‌, రెవెన్యూఅసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు అల్లంపాటి పెంచల్‌రెడ్డి, అసోసియేషన్‌ సభ్యులు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కందుకూరు డివిజన్ల రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *