సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ_
పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలి..
- సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నారాయణ
పది మంది లబ్దిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పొంగూరు నారాయణ పంపిణీ చేశారు. దల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
పేదలకు సీఎం ఆర్ ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు .నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేసారు. 10 డివిజన్లలోని 10 మందికి 19,98,348 రూపాయల చెక్కులను మంత్రి అందచేశారు. సిటీ నియోజకవర్గంలో ఏడాదిలో 86 మందికి 1,16,39,091 రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ మంజూరుకు సహకరించిన నారాయణకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. పేదల ప్రభుత్వం పదికాలాలపాటు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,10 డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు