ప్రసన్న ఇంటిపై దాడిని ఖండించిన నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయకులు
నెల్లూరు చరిత్రలో ఇలాంటి దాడులు చూడలేదు
-ప్రసన్న ఇంటిపై దాడిని ఖండించిన నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయకులు
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడిని ఖండిస్తూ.. నెల్లూరు జిల్లా ముస్లీం మైనారిటీ నాయకులు నెల్లూరు డైకాస్ రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో.. రాష్ట్ర ముస్లిం మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ హంజా హుస్సేనీ, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మోయుద్దిన్, జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, అబ్దుల్ మస్తాన్, గయాజుద్దీన్, కార్పొరేటర్ సత్తార్ తదితరులు మాట్లాడారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. పోలీసుల ముందే దాడి జరిగినా.. వాళ్లూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటం దారుణమన్నారు. ప్రజాక్షేత్రంలో విమర్శలకి.. ప్రతి విమర్శలు సహజంగానే చేయడం జరుగుతుందిగాని.. ప్రతి విమర్శను తట్టుకోలేక ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదని వారు హితవు పలికారు.