లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు వెంటనే ఇవ్వాలి_ _మీడియా సమావేశంలో లకావత్ గిరిబాబు_
నిరుపేదల జీవితాలతో ఆడుకోవద్దు…
- లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు వెంటనే ఇవ్వాలి
- మీడియా సమావేశంలో లకావత్ గిరిబాబు
అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలని… బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విధానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిరుపేదలను మోసం చేసి దొడ్డిదారిలో డబ్బులు సంపాదించేందుకు ఇళ్ల ఎంపికలలో జాప్యం జజరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావయ్య , వెంకటయ్య, మైసయ్య, రాము, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.