న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే_ _మీడియా సమావేశంలో నేదురుమల్లి
దాడి చేస్తే..కేసులు నమోదు చేయరా..?
- న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
- ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికే
- మీడియా సమావేశంలో నేదురుమల్లి
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమని వైసీసీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… ప్రజలు మద్దతు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని వెంకటగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో విషమ సంస్కృతికి టీడీపీ నాయకులు తెరలేపారని విమర్శించారు. ప్రసన్నకుమార్ రెడ్డిపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా…ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని చెప్పారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని…త్వరలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట కోట, వాకాడు, మండలాల వైసిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.