గురువుల్ని కోరిన బంధం ఫౌండేషన్ అధినేత సగిలి_
చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పాలి
- గురువుల్ని కోరిన బంధం ఫౌండేషన్ అధినేత సగిలి
విద్యార్థులకి చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించాలని…అప్పుడే వారి ఉన్నతకి దోహదపడుతుందని బంధం ఫౌండేషన్ అధినేత సగిలి జయరామిరెడ్డి గురువుల్ని కోరారు. నెల్లూరులోని ఎస్ఆర్ కాలేజీలో జరిగిన టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామిరెడ్డిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి జయరామిరెడ్డి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి మంచి నడవడకని నేర్పించే బాధ్యతను తీసుకోవాలని కోరారు. విద్యార్థులందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.