నీటితో ఉండాల్సిన ప్రాజెక్టులో పశువుల మేత
ప్రాజెక్టు తాజా పరిస్థితిపై N3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్
కళతప్పిన గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్ట్…
- నీటితో ఉండాల్సిన ప్రాజెక్టులో పశువుల మేత
- ప్రాజెక్టు తాజా పరిస్థితిపై N3 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్
నిండు కుండలా ఉండాల్సిన ప్రాజెక్టులో పశువులు మేత మేస్తున్నాయి…ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు పచ్చని పంటలతో కళకళలాడాల్సింది పోయి, ఎండిన బీడు భూముల్లా దర్శనమిస్తున్నాయి… అధికారుల నిర్లక్ష్యం కారణంగా లాకులు తెరుచుకోక, భారీ గండి పడిన ఆ ప్రాజెక్ట్… ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాక చుక్క నీరు లేక ఎండి పోయిన పరిస్థితికి చేరింది. అధికారుల ఉదాసీనత రైతుల పాలిట శాపంగా మారి…..కళ తప్పిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గుమ్మడపల్లి పెద్దవాగు ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మా ప్రతినిధి కారం నాగేంద్రబాబు గ్రౌండ్ రిపోర్ట్.