అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి_
ఆగస్టులో రెండు పథకాలు అమలు
- అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
- సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు వివరించారు.
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు, అన్నారెడ్డి పాలెం, ముదివర్తి పంచాయతీలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రజల యోగ క్షేమాలు విచారిస్తూ… స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల పెంపు, దీపం 2 పధకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలెండర్లు, తల్లికి వందనం పధకాల గురించి ప్రజలకు వివరించారు. రైతులను ఆదుకునేందుకు ఈ నెలలో అన్నదాత సుఖీభవ పధకంతో పాటు ఆగష్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి,మండల కన్వీనర్ ఏటూరు శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి,పూండ్ల అచ్యుత్ రెడ్డి, పొనుగోటి నారాయణ,ఎంపీటీసీ చింతాటి జగన్మోహన్, అయ్యప్ప, బండ్ల గోవర్ధన్, రఫీ, ఇమామ్ భాష, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.