ఆగస్టు చివరినాటికి డంపింగ్ యార్డ్ లోని వేస్ట్ అంత తీసివేత – డంపింగ్ యార్డ్ ను అకస్మాత్తుగా పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్
సూళ్లూరుపేటలో డంపింగ్ యాడ్ కు మోక్షం
- ఆగస్టు చివరినాటికి డంపింగ్ యార్డ్ లోని వేస్ట్ అంత తీసివేత
- డంపింగ్ యార్డ్ ను అకస్మాత్తుగా పరిశీలించిన కలెక్టర్ వెంకటేశ్వర్
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూళ్లూరుపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా మాయని మచ్చగా ఉన్నా డంపింగ్ యార్డ్ ప్రక్షాళన కార్యక్రమం చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నడిబొడ్డిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను కలెక్టర్ అకస్మాత్తుగా ఆర్డీవో కిరణ్మయితో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన ఇన్ని సంవత్సరాల తరబడి ఇక్కడ అసౌకర్యంగా ఉన్న డంపింగ్ యార్డ్ ఏర్పాటు సరిగా లేదంటూ తెలిపారు. ఆగస్టు నెల చివరినాటికి డంపింగ్ యార్డ్ లోని లెగసీ వేస్ట్ నంతా తీసేసి ఇక్కడ ఎంతో సుందరంగా పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.చిన్నయ్య, ZIGMA కంపెనీ కు సంబంధించి అధికారులు, మున్సిపల్ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.