సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు_ _భక్తులకు అన్నదానం_
వెంగళరావునగర్లో వైభవంగా గురు పౌర్ణమి
- సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు
- భక్తులకు అన్నదానం
నెల్లూరు వెంగళరావు నగర్లోని సాయిబాబా ఆలయంలో…గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొని సాయిబాబా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని… ఆలయ కమిటీ సహకారంతో…శివాజీ యూత్ ఫౌండేషన్, త్రీ ఎం కార్ స్టూడియో సంయుక్త ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు ఎన్ 3 న్యూస్ తో మాట్లాడారు. ప్రజలందరిపై సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కే ప్రసాద్, తూపిలి శ్రీనివాసులు, చౌకిచర్ల సుధీర్ నాయుడు, గోపీ, అన్నవరపు రమేష్, శ్రీరామ్ సతీష్, బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు.