విద్యార్థులు మంచి మార్గంలో నడవాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – ప్రధానోపాధ్యాయులు ఎస్డి అబ్బాస్ అలీ

కలువాయిలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం

విద్యార్థులు మంచి మార్గంలో నడవాలి…

  • చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
  • ప్రధానోపాధ్యాయులు ఎస్డి అబ్బాస్ అలీ
  • కలువాయిలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన… మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాన్ని… నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్డీ అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.. అనంతరం అబ్బాస్ ఆలీ మాట్లాడుతూ…. గతంలో కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో మంచి సదుపాయాలు ఉన్నాయని…వాటన్నింటిని విద్యార్థులు చక్కగా వినియోగించుకొని భవిష్యత్తు లో ఉన్నత స్థాయి కి వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతోపాటు  క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. అనంతరం పేరెంట్స్ కు గేమ్స్ నిర్వహించి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కోటయ్య, టిడిపి నాయకులు చల్లా రఘురామిరెడ్డి, కలువాయి చెరువు నీటి సంఘం అధ్యక్షులు చల్లా విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఎంసి చైర్మన్ కలువాయి మహేష్, హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *