మోడల్ హైస్కూల్ గా ముత్తుకూరు

సిఎస్సార్ నిధుల తో పాఠశాలల అభివృద్ధి – మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో సోమిరెడ్డి

మోడల్ హైస్కూల్ గా ముత్తుకూరు.
సిఎస్సార్ నిధుల తో పాఠశాలల అభివృద్ధి
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో సోమిరెడ్డి


మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముత్తుకూరు హైస్కూల్ ని మోడల్ హైస్కూల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


ముత్తుకూరు హైస్కూల్ ను మోడల్ హై స్కూల్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన సోమిరెడ్డికి టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్…. కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి… మత్స్యకార విభాగ నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు తదితరులు…. ఘనస్వాగతం పలికారు. నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులతో కలిసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్లో పాల్గొన్న సోమిరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన కిట్లను విద్యార్థులకు అందజేశారు. చలివేంద్రం నుండి 28 మంది గిరిజనులు పాఠశాలలో చేరిన సందర్భంగా సోమిరెడ్డి ఆ విద్యార్థులతో కలిసి ఫోటో దిగి వారితో ముచ్చటించారు. అనంతరం కెనరా బ్యాంక్ సి ఎస్ ఆర్ నిధుల ద్వారా హై స్కూల్ కి ఇచ్చిన 20 కంప్యూటర్ల తాలూకా చెక్కును బ్యాంక్ సిబ్బందితో కలిసి సోమిరెడ్డి హెడ్మాస్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యను నిర్లక్ష్యం చేస్తే అనేక ఇబ్బందులు వస్తాయని అన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుని పాఠశాలలను అభివృద్ధి చేయబోతున్నామని పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన చెప్పారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాకుటూరు రవీంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శంకర్ శ్రీనివాస్ యాదవ్, లీగల్ సెల్ నాయకులు షేక్ అబ్దుల్ షఫీ ఉల్ల…పాఠశాల విద్యా కమిటీ చైర్ పర్సన్ , అధికారులు నాయకులుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *