ఇప్పుడు ప్రభుత్వం అన్నీ వసతులు కల్పిస్తోంది
విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి
రాపూరులో మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం
మా రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాం…
- ఇప్పుడు ప్రభుత్వం అన్నీ వసతులు కల్పిస్తోంది
- విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి
- రాపూరులో మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నెల్లూరు జిల్లా రాపూరు గిరిజన బాలికల గురుకులంలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు విద్యార్థినులను ఉద్దేశించి మేము చదువుకున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలలో ఇప్పుడు ఉన్న వసతులు లేవని చాలా ఇబ్బంది పరిస్థితులు ఉండేవన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలైన వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. చదువుపైన దృష్టి ఉంచి తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి, మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భవాని, ప్రభుత్వ డాక్టర్ సరస్వతి,ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న, జడ్పిటిసి చిగురుపాటి ప్రసన్న, సర్పంచ్ భూపతి జయమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.