మంత్రి లోకేష్ ది అద్భుతమైన ఆలోచన..

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి_ _చదువుకు పేదరికం అడ్డు కాదు

మంత్రి పొంగూరు నారాయణ_ _నెల్లూరులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

మంత్రి లోకేష్ ది అద్భుతమైన ఆలోచన…

  • ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
  • చదువుకు పేదరికం అడ్డు కాదు
  • మంత్రి పొంగూరు నారాయణ
  • నెల్లూరులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్


ల్లూరు నగరం ఆర్ఎస్ఆర్ స్కూల్ లో మెగా పేరెంట్స్ ,టీచర్స్ మీటింగ్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనేందుకు పేరెంట్స్ కి ఓ మంచి అవకాశమని వారు తెలిపారు. మంత్రి లోకేష్ ది అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు.


విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అద్భుతమైన ఆలోచన చేశారని… పేరెంట్ ,టీచర్స్ మీటింగ్ మంచి కార్యక్రమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు నగరం ఆర్ఎస్ఆర్ స్కూల్ లో మెగా పేరెంట్స్ ,టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణతో కలసి ఎంపీ పాల్గొన్నారు. ఎంపీ, మంత్రికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉత్తమ విద్యార్థులను ఘనంగా సన్మానించి మొక్కలు పంపిణీ చేశారు. చిన్నారుల స్వాగత నృత్యప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. తల్లితండ్రులు ,విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ….అర్ ఎస్ ఆర్ స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనేందుకు పేరెంట్స్ కి ఓ మంచి అవకాశన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ….రాష్ట్రంలో 45,094 ప్రభుత్వ ,ఎయిడెడ్ స్కూల్స్ లో పేరెంట్స్ ,టీచర్ మీటింగ్ జరుగుతోందని….భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగదన్నారు. పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశం తో మంత్రి నారా లోకేష్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టారన్నారు. అనంతరం కమిషనర్ నందన్, ,డీఈఓ బాలాజీ రావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి ,నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు ,కార్పొరేటర్లు, టీడీపీ ముఖ్యనేతలు ,కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *