ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన రాఘవేంద్రరెడ్డి
ప్రసన్నని పరామర్శించిన బొమ్మిరెడ్డి
- ధ్వంసమైన ఇంటిని పరిశీలించిన రాఘవేంద్రరెడ్డి
ఇటీవల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై కొందరు వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నగరంలోని నల్లపరెడ్డి నివాసానికి విచ్చేసి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించారు. ఘటన స్థలాన్ని మొత్తం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు.