కల్తీ లేని వార్తలు సంచలనం రేపే కథనాలు_
మెగా పేరెంట్స్ ,టీచర్స్ మీటింగ్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణలు పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకొనేందుకు పేరెంట్స్ కి ఓ మంచి అవకాశమని వారు తెలిపారు. మంత్రి లోకేష్ ది అద్భుతమైన ఆలోచన అని ప్రశంసించారు.
ఆ హోటల్లో మళ్లీ సీన్ రిపీట్ అయ్యింది…మొన్న ఇడ్లీ సాంబారులో బొద్దింక…నేడు మినీ మీల్స్ లో బల్లి… ఒక్క సారిగా భయాందోళనకు గురైన ఆహార ప్రియులు…అయినా మారని హోటల్ నిర్వాహకుల తీరు…ఇంతకీ ఆ హోటల్ ఏదనుకుంటున్నారా… వాచ్ ద ఎన్ 3 న్యూస్
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలేజా ఉంటే చూసుకుందాం రండి అని సవాల్ విసిరారు.
మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలపై టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రత్యేకంగా నారా లోకేష్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అజీజ్ తెలిపారు.
నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణలు సుడిగాలి పర్యటన జరిపారు. నగరంలోని పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు. సిటీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎంపీ వేమిరెడ్డి తెలిపారు.
కుప్పంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బారాషహీద్ దర్గాను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రొట్టె పట్టుకున్నారు.
ఏ సమస్య ఉన్నా…తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల్ని కోరారు. ఇందుకూరుపేటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయిబాబా మందిరాల్లో సాయినాథునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాల వద్ద భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు.
మెగా టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల భవితవ్యాన్ని నిర్ణయించేది నైతిక విలువలెనని ప్రశాంతిరెడ్డి తెలిపారు.
ఉపాధి కూలీలకి వంద రోజుల పని దినాలు కల్పించాలని…నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు తప్పని సరిగా పూర్తి చేయాలని ఏపీడీ గాయత్రీదేవి ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
రాపూరులోని సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. పలువురు అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంతో కో ఆప్షన్ సభ్యులు, అధికారుల మధ్య కొద్ది సేపు మాటల యుద్ధం జరిగింది.
మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముత్తుకూరు హైస్కూల్ ని మోడల్ హైస్కూల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.