పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్_ _కావలి మండలం రుద్రకోటలోని జడ్పీ హైస్కూల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి_ _తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదవాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే_
తల్లిదండ్రులు పాఠశాలను సందర్శించాలి
- పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్
- కావలి మండలం రుద్రకోటలోని జడ్పీ హైస్కూల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
- తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదవాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగులు జరిగాయి. కావలి
మండలం రుద్రకోటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పాఠశాలలో విద్యార్థులతో ఎమ్మెల్యే ముచ్చటించారు. సెల్ఫీలుదిగి వారిని ఉత్సాహ పరిచారు. అదేవిధంగా తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రుకు తరచూ పాఠశాలకు రావాలని, పిల్లలు ఏవిధంగా చదువుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటారని, మాలా మా బిడ్డలు కష్టపడకూడదని నిరంతరం శ్రమిస్తూ ఉంటారన్నారు. పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి కస్టపడీ చదవాలని సూచించారు. 20 ఏళ్ళు చదువుకు కష్టపడితే ఆ తర్వాత 50 ఏళ్లు సుఖంగా ఉంటారని, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడే విజయం ఉంటుందని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ ఎంఈఓలు గోవిందయ్య, వెంకటసుబ్బయ్య, ప్రధానోపాధ్యాయుడు చాగంటి మురళి, మరియు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.