చిన్న వయసు నుంచే ఎర్లీ గొల్స్ పెట్టుకోవాలి

తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహంలో మార్పు రావాలి

నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్

పిఎన్ఎం జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్

చిన్న వయసు నుంచే ఎర్లీ గొల్స్ పెట్టుకోవాలి…

  • తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహంలో మార్పు రావాలి
  • నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్
  • పిఎన్ఎం జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్


మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రత్యేకంగా నారా లోకేష్ పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అజీజ్ తెలిపారు.


కుల మతాల వ్యత్యాసాలు చదువుతో మాత్రమే తొలగించగలమని సమానత్వం చదువుతో మాత్రమే వస్తుందని…ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ తెలిపారు. నెల్లూరు నగరంలోని జెండా వీధిలో గల పిఎన్ఎం జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ఉఫాధ్యాయులు, విద్యార్థులు ఆయన్ని శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి తల్లితండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. తల్లిదండ్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను అధికారులను ఆదేశించారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వారి వేతనాల సమస్యను అబ్దుల్ అజీజ్ కు తెలిపారు. తక్షణమే మంత్రి నారాయణ, అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తదనంతరం స్కూల్ నందు భోజనం చేశారు. అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. కార్యక్రమంలో జాఫర్ షరీఫ్, జమీర్, రబ్బాని, అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *