కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి_ _ఇందుకూరుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన_
8 గంటల విధానాన్ని కొనసాగించాలి
- కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి
- ఇందుకూరుపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన
10 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సీఐటీయూ మండలాధ్యక్షులు ఎస్కే ఛాన్ బాషా డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలలోని పలు పరిశ్రమల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, ఆటో కార్మికులు పలు పరిశ్రమల్లో పని చేస్తున్న వర్కర్లు సంయుక్తంగా ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లేబర్ చట్టాలను మార్చి కార్మికులను బానిసలుగా చూస్తామని ఊరుకోమని… స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్ సభ్యులు దయాసాగర్, ప్రసాద్, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు..