అధికారుల్ని ఆదేశించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
పెద్ద పడుగుపాడు కాలువ పెండింగ్ పనులు, బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
సైడ్ వాల్ బ్రిడ్జిని పూర్తి చేయాలి
- అధికారుల్ని ఆదేశించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
- పెద్ద పడుగుపాడు కాలువ పెండింగ్ పనులు, బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు వద్ద ఈ మధ్యకాలంలో హైవే విస్తరణ జరిగిన నేపథ్యంలో పెద్ద పడుగుపాడు కాలవ పెండింగ్ పనులు, బ్రిడ్జ్ ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు టిడిపి నాయకుల అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు విస్తీర్ణ, బ్రిడ్జి పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…వ్యవసాయానికి ఉపయోగపడే పారుదల కెనాల్ బ్రిడ్జి పనులను హైవే రోడ్డు వెడల్పు పనులను పరిశీలించడం జరిగిందన్నారు. పారుదలకు ఇబ్బందులు లేకుండా సైడ్ వాల్ బ్రిడ్జిని పూర్తి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… హైవేకి రైతులకు రైల్వే బ్రిడ్జికి సంబంధించిన సదరన్ ఛానల్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మాణాన్ని ఎంపీతో కలిసి పరిశీలించామని చెప్పారు. నాణ్యత పరంగా ఎలాంటి లోటుపాటులు లేకుండా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని అధికారులకు నాయకులకు సూచించారు…. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు…