మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు
మహిళలపై అసభ్య పదజాలం వాడితే సహించం
- మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సొసైటీ మాజీ అధ్యక్షులు జూపల్లి రాజారావు అన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని…రాజకీయాల్లో మహిళల ఎదుగుదలను ఓర్వలేకే వైసీపీ నాయకులు ఈ తరహా ఆరోపణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వేమిరెడ్డి దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి జిల్లాలో పేరు ప్రతిష్టలు గావించారని, రానున్న కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని రాజారావు హెచ్చరించారు.