నల్లపరెడ్డిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి_
ప్రసన్నపై ఎమ్మెల్యే కాకర్ల ఫైర్…
- నల్లపరెడ్డిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను…ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రసన్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వ్యక్తులను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.