లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్_ _కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
భారీగా తరలి వచ్చిన కార్మికులు_
నెల్లూరులో కదం తొక్కిన కార్మిక లోకం…
- లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్
- కేంద్రానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు
- భారీగా తరలి వచ్చిన కార్మికులు
కార్మికులకు గుదిబండగా మారిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని…10 గంటల పని విధానాన్ని వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు నగరంలో కార్మికులు కదం తొక్కారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్స్ రద్దు చేసి…కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం సీఐటీయూ నాయకులు అజయ్ కుమార్, శంకర్ కిషోర్, సీఎస్ సాగర్, జయరాంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు నాగేశ్వరరావు, ప్రసాద్, కొండా ప్రసాద్, పెంచల నరసయ్య, కత్తి శ్రీనివాసులు తదితరులు, కార్మికులు పాల్గొన్నారు.