ప్రసన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి_ _విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే_
చీడ పురుగులను రాజకీయాల నుంచి తరిమేయండి
- ప్రసన్నపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
- విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిణి, దండిగుంట గ్రామాలలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఇంటిటికెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. యోగ క్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం తదితర ప్రభుత్వ పధకాలు అందని వారి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించ వలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. చెడు తిరుగుళ్లకు దూరంగా వుండాలని స్థానిక యువతకు హితోపదేశం చేశారు. నడవలేని ఓ దివ్యాంగుడి అవస్థలు చూసి స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందచేస్తానని హామీ యిచ్చారు. వరిణి గ్రామ పెద్దలతో కలిసి స్థానిక సమస్యలపై చర్చించారు. పంచాయతి స్థలాన్ని శ్మశానికి కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…కోవూరు నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు చూసి ఓర్వలేకే ప్రసన్న చెవాకులు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, చెముకుల చైతన్య కృష్ణ, శ్రీహరి రెడ్డి, సత్యం రెడ్డి స్థానిక నాయకులు ప్రజలు పాల్గొన్నారు .