_77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాత్ర_
ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర
- 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యాత్ర
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. స్థానిక విశ్వోదయ కాలేజీ ప్రాంగణం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర వెంకటగిరి పుర వీధుల్లో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ…..ఏబీవీపీ ఆవిర్భవించి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏబీవీపీ అని అన్నారు. ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.