ఆ పేరుతో ఒక నౌక ఉందని చాలా మందికి తెలియదు_
ఉదయగిరి పేరుతో యుద్ధనౌకా…?
ఉదయగిరి పేరుతో ఓ యుద్ధనౌక ఉందన్న విషయం మీకు తెలుసా..? అవును ఉదయగిరి పేరుతో ఇండియన్ నేవి షిఫ్ ఒకటి ఉంది. భారతదేశ నౌకాదళ కమిటీ ఉదయగిరి గ్రామపంచాయతీలోని ఉదయగిరి కోటను సందర్శించే వరకు…. ఆ పేరుతో ఒక నౌక ఉందని చాలా మందికి తెలియదు. తాజాగా ఉదయగిరి కోట మీద ఉన్న పెద్ద మసీదును కూడా కమిటీ సభ్యులు సందర్శించారు. ఉదయగిరి సర్పంచ్ పాములూరు సామ్రాజ్యం, ఉప సర్పంచ్ ముత్తుజా హుస్సేన్ మరియు పంచాయతీ కార్యదర్శి షేక్ కరిముల్లాని కలిసి.. ఉదయగిరికి సంబంధించి చరిత్రను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఉదయగిరి గ్రామపంచాయతీకి రావలసిన వెల్ఫేర్ బెనిఫిట్స్ ను నౌకాదళ కమిటీ నుంచి వచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. తమ ప్రాంతం పేరుతో ఓ యుద్ధ నౌక అదీ ఇండియా నేవిలో ఉండడంతో ఉదయగిరి వాసులు గర్వ పడుతున్నారు.