కొడుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు_ _కుటుంబ పోషణ భారంగా మారింది
దాతలకు తల్లిదండ్రులు విన్నపం_
ఆదుకోండయ్యా…పుణ్యం ఉంటుంది
- కొడుకు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు
- కుటుంబ పోషణ భారంగా మారింది
- దాతలకు తల్లిదండ్రులు విన్నపం
గత రెండేళ్ళ క్రితం ఇంటి పెద్ద కుమారుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు…మరో ఇద్దరు చిన్నపిల్లల పోషన కష్టంగా మారింది… కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటు జీవనం సాగిస్తున్నానని.. దాతలు స్పందించి సహాయం చేయాలని తిరుపతి జిల్లా గూడూరు మండలం పొటుపాలెం గ్రామానికి చెందిన తిరునామల్లి వెంకటేశ్వర్లు భార్య లక్ష్మమ్మ కోరుతున్నారు… తమ పెద్ద కుమారుడు పవన్ గత రెండేళ్లు క్రితం వచ్చిన భారీ వర్షాలకు వరద ప్రవాహం కారణంగా పంబలేరు వాగులో పడిపోయి మృతి చెందాడు… అప్పటినుండి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబం ఇబ్బందులు పడుతున్నామని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు… తమకు సహాయం చేయాలని కోరుతూ అధికారులు రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతునన్నా తమకు ఎవరు న్యాయం చేయలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు… దాతలు ఎవరైనా స్పందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు…