బి.వి పురం ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు_ _ఇంటింటికెళ్లి ఏడాది పాలనను వివరించిన టీడీపీ నేతలు_
ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- బి.వి పురం ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు
- ఇంటింటికెళ్లి ఏడాది పాలనను వివరించిన టీడీపీ నేతలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బీవీపురం ఎస్టీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తుందని తెలియజేశారు…అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, పాపిరెడ్డి, కామేశ్వర యాదవ్, రవీంద్రనాథ్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…