రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు_ _
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి_ _15 కోట్లతో మినీ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం
అభివృద్ధి శ్రీధర్ రెడ్డికే సాధ్యం
- రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు
- నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- 15 కోట్లతో మినీ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం
అభివృద్ధి అనేది ఒక్క రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే సాధ్యమని… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మినీబైపాస్ రోడ్డు అభివృద్ధికి 15 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోటంరెడ్డితో కలసి ముఖ్య అతిధిగా ఎంపీ వేమిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలకి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా మినీ బైపాస్ రోడ్డుకి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రూరల్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… నిస్వార్ధ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, క్లస్టర్ ఇంచార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, క్లస్టర్ ఖాదర్ భాషా కార్పొరేటర్ చేజర్ల మహేష్, డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి, పోతురాజు రవి, అన్నంగి రమణయ్య ,చేజర్ల కవిత, పద్మజా యాదవ్, అల్లం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.