లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్_
అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన
- లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్
లేబర్ కోడ్ ను రద్దు చేయాలని, పని సమయాలను కుదించాలని, ప్రభుత్వం వేతనాలను సరైన సమయంలో మంజూరు చేయాలనే డిమాండ్లతో అఖిల పక్షం నాయకులు ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఖమ్మం, భద్రాచలం రహదారిపై ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడి టీచర్లు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు కార్మిక హక్కుల గురించి వివరించారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.