ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు తగదు – జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీధర్ రెడ్డి
హుందాతనం రాజకీయాలు కరువయ్యాయి
ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలు తగదు
-జిల్లా బిజెపి అధ్యక్షులు వంశీధర్ రెడ్డి.
జిల్లాలో ప్రాధాన్యత గల రాజకీయ కుటుంబాలు ఉన్నాయని.. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు, నెల్లూరు నుండి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి వరకు ఎదిగి రాజకీయాలు చేసి చూపించారని అలాంటి ఆదర్శవంతమైన నెల్లూరులో హుందాతనమైన రాజకీయాలు నేడుకరువయ్యాయని, గత కొంతకాలంగా జిల్లా రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, దీనికి భిన్నంగా నేడు కోవూరు నియోజకవర్గ రాజకీయం తయారైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి అన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతూ.. అవి వ్యక్తిగత విమర్శలకు, దాడులకు దారితీయడం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయాలలో ఇలాంటి పరిస్థితులు రాబోవు రోజులలో పునరావతం కాకుండా చూడాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి అని.. కొత్తగా రాజకీయాలకు రావడం.. కొంత రాజకీయంగా వెనకబడడం సహజమేనని.. దానికి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు.. దూషణలకు దిగడం.. ఆమె పరువు ప్రతిష్టలు.. కుటుంబ గౌరవాలకు భంగం కలిగే విధంగా మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో కోవూరు అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర ,బిజెపి ఓబీసీ మోర్చా కోస్తాంధ్ర జోన్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్, జిల్లా బిజెపి కార్యదర్శి దాసరి ప్రసాద్ గౌడ్ ,జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహనాయుడు ,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కరణం సుభాషిని తదితరులు పాల్గొన్నారు