నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు గంటా రవితేజ, పొంగూరు షరణి
ఘనంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలు
విద్యార్థుల కలలను సాకారం చేస్తున్న నారాయణ
నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు గంటా రవితేజ, పొంగూరు షరణి
ఘనంగా నారాయణ మెడికల్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకలు
మెడికల్ స్టూడెంట్స్ గా వేలాదిమంది విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు నారాయణ గ్రూప్ ఎన్నో రకాలుగా ఎల్లప్పుడు ప్రయత్నం చేస్తుంటుందని మంత్రి నారాయణ అల్లుడు గంటా రవితేజ అన్నారు.నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో….కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. స్థానిక మెడికల్ కాలేజ్ ఆవరణలోని ఏపీజే అబ్దుల్ కలాం ఆడిటోరియం లో జరిగిన ఫేర్వెల్ డే వేడుకలకు గంటా రవితేజ, పొంగూరు శరణి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడికల్ కాలేజ్ అధ్యాపక బృందంతో కలిసి రవితేజ శరణులు ప్రశంసా పత్రాలు అందజేశారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రొఫెసర్లకు మేమెంటల్ అందజేసి వారి సేవలను కొనియాడారు అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పలువురు అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.