రాపూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
యోగాంధ్రకు 300 కోట్లు
మా జీతాలు మాత్రం పెంచలేదు
- రాపూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
యోగాంధ్రకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లను వెచ్చించిందని… దానికి బదులు తమ వేతనాలు పెంచి ఉంటే తమ కుటుంబాలలో వెలుగు నిండేదని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని రాపూరు, సైదాపురం మండలాల అంగనవాడి కార్యకర్తలు, హెల్పర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ నాయకులతో తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సంవత్సరం కాలం పూర్తయిన కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. అంగన్వాడీ సిబ్బందికి నాడు ఇచ్చిన హామీలను వెంటనే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, ఐసిడి ఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు జయసుధ, కార్యదర్శి ప్రమీల, అంగనవాడి కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.