మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనూరాధ
16వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగులు
నారాయణ సార్ తోనే నెల్లూరు అభివృద్ధి
- మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనూరాధ
- 16వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగులు
నెల్లూరు నగరం 16వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలసి డివిజన్లోని 243,244 బూత్ లలో ఇంటింటికెళ్లి… ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అనూరాధ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారో…నెల్లూరుని కూడా మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కూటమి పాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 16 వ డివిజన్ అధ్యక్షులు పెనుబర్తి సాయిరాం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.