జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతాం
వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ వ్యాఖ్యలు
మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణిపై లోకేష్ ప్రశంసల వర్షం_
సీట్లు లేవనే బోర్డు చూస్తే సంతృప్తి…
- జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతాం
- వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ వ్యాఖ్యలు
- మంత్రి నారాయణ, ఆయన కుమార్తె షరణిపై లోకేష్ ప్రశంసల వర్షం
ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు అడ్మిషన్లు ముగిశాయి… సీట్లు లేవనే బోర్డు చూస్తేనే విద్యామంత్రిగా తనకు సంతృప్తి కలుగుతుందని విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. జీవితంలో సవాళ్లను స్వీకరించినప్పుడే లక్ష్యానికి చేరువవుతామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన విఆర్సి పాఠశాల గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా మిగిలితే, పట్టుదల, క్రమశిక్షణకు మారుపేరైన మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇతరులు అసూయపడే రీతిలో అధునాతన వసతులతో తీర్చిదిద్దిన ఎన్ సి సి గ్రూపును, మంత్రి నారాయణ కుమార్తె షరణి ని అభినందించారు. విద్యా శాఖను బలోపేతం చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే తపనతోనే పవిత్రమైన బాధ్యతలు స్వీకరించానన్నారు.