భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ప్రజలు – మనుబోలులో ఘటన
పేలిన మినీ గ్యాస్ సిలిండర్…
- భయబ్రాంతులకు గురై పరుగులు తీసిన ప్రజలు
- మనుబోలులో ఘటన
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన బీసీ కాలనీలో నీ ఇంట్లో మినీ గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ బయటకు పరుగులు తీశారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఎస్ కే మీరాబాషా బాషా ఇంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మండల కేంద్రంలో పలు దుకాణాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మినీ గ్యాస్ సిలిండర్ లకు గ్యాస్ పడుతున్నారని… అందువల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా గ్యాస్ ప్రమాదంతో ఎలాంటి ఆపద రాలేదని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.