వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కురుగొండ్ల ధ్వజం వెంకటగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు
పెత్తనాలు చేస్తే ఊరుకోం…
- వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కురుగొండ్ల ధ్వజం
- వెంకటగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు
తిరుపతి జిల్లా వెంకటగిరి 4 వార్డు సాలి కాలనీలో సుపరిపాలల్లో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికి అందుతున్నాయా లేదా ఆరా తీశారు. కాసేపు సరదాగా వడలు కాలుస్తూ పేద ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ… ఇది జగన్ ప్రభుత్వం కాదని, వైసిపి నాయకులు పెత్తనాలు చేస్తే ఊరుకునేది లేదని… కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, నాలుగో వార్డ్ ఇంచార్జ్ వెంకట మునిరత్నం, పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, ఏఎంసి మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు పునుగొటి విశ్వనాథం, పట్టణ మాజీ అధ్యక్షులు ఆనంద్, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, నర్సింహులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.