కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కదిలి వస్తున్న భక్తజనం
భక్తులతో కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం
ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభం…
- కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి కదిలి వస్తున్న భక్తజనం
- భక్తులతో కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం
- ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
మతసామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తజన కోర్కెల తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. నేటి నుంచి ఈనెల 10 వరకు ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల నుంచి భక్తజనం తరలి రావడంతో దర్గా ప్రాంగణం భక్తులతో కళకళలాడుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అన్నీ వసతులు సమకూర్చింది. ముఖ్యంగా పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1600 పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. దర్గా ప్రాంగణం, 24 పార్కింగ్ ప్రదేశాల్లో 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు.