పెన్నానది వద్ద యాత్రికుల రక్షణకు ముందస్తు చర్యలు
సంగంలో హెచ్చరిక బోర్డులు…
- పెన్నానది వద్ద యాత్రికుల రక్షణకు ముందస్తు చర్యలు
నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది, బ్యారేజి ల వద్ద ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆరో తేదీ నుండి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం కానుండటంతో మండల రెవెన్యూ,పోలీస్,ఇరిగేషన్ యంత్రాంగం అప్రమ్మతమై పెన్నానది వద్ద యాత్రికుల రక్షణకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నెల్లూరుకు వచ్చే రొట్టెల పండుగ యాత్రికులు తిరుగు ప్రయాణం సమయంలో దగ్గరలో ఉన్న పెన్నా బ్యారేజీ ని సందర్శిస్తారు .అక్కడే సేదధీరి తమ సొంత ఊర్లకు బయలుదేరుతారు. ఈ క్రమంలో బ్యారేజీలో ఈత సరదాలకు నదిలో దిగకుండా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ముల్లకంప తో మూసివేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.ఐదు రోజులపాటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.