రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి -నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
భావితరాల అభివృద్ధికోసం పి-4
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శుక్రవారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అనూషతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేకి ఆర్డీవో అనూష, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి.. ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం కోటంరెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి.. భావితరాల అభివృద్ధికోసం పీ-4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టడం అభినందనీయం అని ఈసందర్భంగా కోటంరెడ్డి కొనియాడారు. అలాగే.. రూరల్‌లో అభివృద్ధిపై దృష్టిపెట్టడం జరిగిందన్నారు. ఆర్డీవో మంచి అధికారి అని.. చాలా చక్కగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. అనంతరం ఆర్డీవో కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దారు, సిబ్బంది పాల్లొన్నారు.