గుంట‌బ‌డి ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి

త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశం

గుంట‌బ‌డి ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి
త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేయాల‌ని ఆదేశం

నెల్లూరు న‌గ‌రం.. 49వ డివిజ‌న్‌లోని గుంట బడిని రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ శుక్ర‌వారం రాత్రి సంద‌ర్శించారు. పి-4లో భాగంగా.. మంత్రి నారాయ‌ణ స్పూర్తితో.. ఆ పాఠ‌శాల అభివృద్ధి, సౌక‌ర్యాల క‌ల్ప‌న‌తోపాటు అభివృద్ధి కోసం డీఎస్ఆర్ క‌న్స్ స్ట్ర‌క్ష‌న్స్ అధినేత సుధాక‌ర్‌రెడ్డి సోద‌రులు అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ శ‌ర‌వేగంగా వివిధ ప‌నులు, క‌ట్ట‌డాలు జ‌రుగుతున్నాయి. ఆయా ప‌నుల‌ను మంత్రి నారాయ‌ణ స్వ‌యంగా ప‌రిశీలించారు. త్వ‌రిత‌గ‌తిన ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. నారాయ‌ణ‌తోపాటు డిప్యూటీ మేయ‌ర్ రూప్‌కుమార్ యాద‌వ్‌, తాళ్ల‌పాక అనురాధ‌, ఖాద‌ర్ బాషా, కార్పొరేట‌ర్‌, డివిజ‌న్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *