ఆంగ్ల భాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన ఉపాధ్యాయులు
ఓవెల్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు
- ఆంగ్ల భాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన ఉపాధ్యాయులు
నెల్లూరు అన్నమయ్య సర్కిల్ లోని ఓవెల్ స్కూల్లో ఆంగ్ల భాష వారోత్సవాలను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాఠశాల చైర్మన్ ఆర్ వేణు విచ్చేశారు. ఆంగ్ల భాష గొప్పతనం, ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆంగ్ల భాషపై చేసిన కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ రమణయ్యనాయుడు, ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలియజేశారు. విద్యార్థులందరూ ఆంగ్ల భాష మీద పట్టు సాధించేందుకే ప్రతీ సంవత్సరం జులై నెల మొదటి వారంలో ఆంగ్ల భాష వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఈవో ప్రమీణ, జీఎం మహదేవయ్య, ఈగీ బాలు, అకడమిక్ డీజీఎం ఎస్ కే రఫీ, ఇన్చార్జి గిరిధర్, ఏజీఎం కిషోర్, ఆంగ్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.