ఆకట్టుకున్న విద్యార్థుల పద్యాలు, కథలు, సామెతలు, పాటలు
ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకి తెలియజేసిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
ఓవెల్ ఐసీవో క్యాంపస్ లో ఆంగ్ల భాష వారోత్సవాలు
- ఆకట్టుకున్న విద్యార్థుల పద్యాలు, కథలు, సామెతలు, పాటలు
- ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకి తెలియజేసిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు
నెల్లూరులోని ఓవెల్ ఐసీవో క్యాంపస్ లో ఆంగ్ల భాష వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వారత్సవాల్లో 288 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఇంగ్లీష్ కి సంబంధించిన చార్టులు, పద్యాలు, కథలు, సామెతలు, పాటలు, సంభాషణలు మొదలైనవి అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థుల కార్యక్రమాలు ఆధ్యయంతం అందరిని ఆకట్టుకున్నాయి. ఆంగ్ల భాష గొప్పతనం, ప్రాముఖ్యతను విద్యార్థులకి ప్రిన్సిపాల్ బాలు, ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ వేణు, సీఈవో ప్రమీల, జీఎం మహదేవయ్య, డీజీఎం రఫి, ఎగ్జిక్యూటీవ్ ఇన్చార్జి రహమతున్నీసా, ఏజీఎం అబూబకర్, ఉపాధ్యాయులు, ఇంగ్లీషు టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.