వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు పట్టించుకోరా
గ్రామ సభలోనూ కరేడు గ్రామస్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు
జగన్.. పవన్ మీ స్టాండ్ ఏంటీ..? మీరు ఎవరి పక్షం -సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్ డిమాండ్
ఇండో సోలార్ కంపెనీ వద్దే వద్దు..!
వేలాది మంది రైతులు పోరాడుతుంటే.. అధికారులు పట్టించుకోరా
గ్రామ సభలోనూ కరేడు గ్రామస్తులు పొలాలు ఇవ్వం అని తెగేసి చెప్పారు
- జగన్.. పవన్ మీ స్టాండ్ ఏంటీ..? మీరు ఎవరి పక్షం
సీఐటీయూ నాయకులు అజయ్‌కుమార్ డిమాండ్
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కరేడులో ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటును ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఏర్పాటుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా భూములను నమ్ముకుని వేలాది మంది ఆధారపడి ఉన్నారని.. వారందరిని ఇబ్బంది పెట్టొద్దని కోరారు. గతంలో పరిశ్రమల కోసం వేలాది ఎకరాలను తీసుకున్న పారిశ్రామికవేత్తలు నెల్లూరులో పరిశ్రమలు పెట్టారా..? అని నిలదీశారు. కరేడు గ్రామంలో రాజకీయాలకు అతీతంగా వేలాది మంది గ్రామ సభకు వచ్చి.. పొలాలు ఇవ్వబోమంటూ.. తెగేసి చెప్పారన్నారు. మూడు కారులు పండే పంటలను భూ స్వాములకు పంచిపెట్టడం దారుణం అన్నారు. ప్రజలు, రైతుల అభిష్టం మేరకు ఇండో సోలార్ కంపెనీ వెనక్కు వెళ్లాలని.. లేదంటే.. ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈసందర్భంగా అజయ్‌కుమార్ హెచ్చరించారు. ఇండో సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్టాండ్ ఏంటో చెప్పాలని.. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఈసందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అనతంతరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నెల్లూరు జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, ఎస్ యూ ఈ ఐ కె జిల్లా నాయకులు సురేష్‌లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నాయకులు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.