మంత్రి పొంగూరు నారాయణ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి
అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి తీరుతాం
- మంత్రి పొంగూరు నారాయణ
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన 50వ సీఆర్డీ అథారిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. గతంలో 2018 మాస్టర్ ప్లాన్,డిజైన్ లకు ఆలస్యం కావడం తో నిర్మాణం ఆలస్యమైందని గుర్తు చేశారు. ఈసారి అమరావతి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. జగన్ మళ్లీ వస్తాడని అనుమానం ఏ మాత్రం అవసరం లేదని…జగన్ ఈసారి ఆ 11 సీట్లు కూడా గెలవడని తనదైన శైలిలో సెటైర్లు వేశారు.