పగలు, రాత్రి గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలు
జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ
Apache బైక్ లపై పోలీసుల గస్తీ…
- పగలు, రాత్రి గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలు
- జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ
నెల్లూరు నగరంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రారంభించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో 20 నూతన ద్విచక్ర వాహనాలను ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీలు తదితరులతో కలసి ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ…ఈ వాహనాల ద్వారా ట్రాఫిక్ నియంత్రణకు మరింత తోడ్పాటు అందిస్తాయని.. పగలు, రాత్రి గస్తీ తిరిగేందుకు, అత్యవసర సమయాల్లో సంఘటనా స్థలాలకు త్వరగా చేరేందుకు ఈ వాహనాలను ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వాహనాలలో, జిల్లాకి 20 ద్విచక్ర వాహనాలు కేటాయించబడ్డాయని, వీటిని నెల్లూరు ట్రాఫిక్, టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూర్ సబ్ డివిజన్ల సిబ్బందికి అందచేయడం జరిగిందని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య , టౌన్ డిఎస్పి సింధుప్రియ , రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు , ఏ.ఆర్ డి.ఎస్.పి చంద్రమోహన్, టౌన్ CI లు, ఆర్ఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.