గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం
దాడి చేసే చంపేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసన
హత్య…? ఆత్మహత్య…?
- గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం
- దాడి చేసే చంపేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
- మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసన
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామం చెందిన గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం రేపింది. నీలం సుబ్బయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మస్తానమ్మ, అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తులు దాడి చేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానుషంగా తన భార్యపై దాడి చేయడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి భర్త సాయి బైఠాయించారు. మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రూరల్ సీఐ సాంబశివరావు బాధితులను రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని కోరడంతో జాతీయ రహదారి నుంచి పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ బైఠాయించారు. నిందితులపై కఠినమైన చర్యలు ఉంటాయని సీఐ భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.