ఇళ్ల స్థలాలు లేని గిరిజనులకు మూడు సెంట్ల స్థలం పంపిణీ
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్
సౌకర్యాలు లేని స్కూళ్లు..
అంగన్వాడీ కేంద్రాలపై నివేదిక సిద్ధం చేయాలి..!
ఇళ్ల స్థలాలు లేని గిరిజనులకు మూడు సెంట్ల స్థలం పంపిణీ
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్
తిరుపతి జిల్లా.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖచ్చితంగా అన్ని సౌకర్యాలుండాలని.. సౌకర్యాలు లేని కేంద్రాల జాబితా సిద్ధం చేసి.. 15 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని.. శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈమేరకు ఆయన పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి… కాన్స్టెన్సీ విజన్ యాక్టివ్ ప్లాన్ 2047 లో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో స్కూలు, అంగన్వాడి కేంద్రాలలో.. కచ్చితంగా తాగునీటి సదుపాయం, ఇతర సౌకర్యాలు కచ్చితంగా ఉండాలన్నారు. అలా లేనటువంటి గ్రామాల లిస్టును తయారుచేసి.. 15 రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే.. ఇళ్ల స్థలాలు లేని గిరిజనులకు మూడు సెంట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఆర్డిఓ, తహసీల్దారు, ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండేలా.. 40 మినీ మీసేవ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈసందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.