భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలి
అధికారుల్ని ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కార్తీక్
పండుగ ఏర్పాట్లు, నిర్వహణపై బారాషహీద్ దర్గా వద్ద అధికారులతో జేసీ సమీక్ష
రొట్టెల పండుగను పటిష్టంగా నిర్వహించాలి
- భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలి
- అధికారుల్ని ఆదేశించిన జాయింట్ కలెక్టర్ కార్తీక్
- పండుగ ఏర్పాట్లు, నిర్వహణపై బారాషహీద్ దర్గా వద్ద అధికారులతో జేసీ సమీక్ష
ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేసి రొట్టెల పండుగను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారుల్ని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న పండుగ ఏర్పాట్లను ఆయన ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, కమిషనర్ లతో కలసి పరిశీలించారు. పండుగ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
అన్నీ శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేసి…భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రొట్టెల పండుగను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కార్తిక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు బారాషాహీద్ దర్గా వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ… విధులు కేటాయించిన అధికారులు విధిగా 24/7 విధులు నిర్వహించేలా సిబ్బందిని నియమించాలని, సదరు వివరాలను అందరూ జిల్లా అధికారులకు తెలియచేయాలన్నారు. పండుగ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ కు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం జిల్లా యస్.పి.కృష్ణ కాంత్, మునిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ లతో కలసి దర్గా, స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ లు, బారికేట్ల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.